శ్రీలీల వెర్సస్ సంయుక్త.! పోటీ గట్టిగానే సుమా.!
- June 13, 2023
ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ ఛెయిర్‌ని అందుకోవాలని కుతూహలపడుతోన్న హీరోయిన్లలో సంయుక్త మీనన్, శ్రీలీల మధ్య పోటీ గట్టిగా వుందనే చెప్పాలి.
ఈ ఇద్దరికీ టాలీవుడ్‌లో పట్టిందల్లా బంగారమే అవుతోంది. దాంతో, లక్కీ ఛామ్స్‌గా చెలామణీ అవుతున్నారు. అయితే, సంయుక్తతో పోల్చితే శ్రీలీలకు అవకాశాలు జోరుగా వస్తున్నాయ్.
శ్రీలీలను అందుకోవాలని సంయుక్త ప్రయత్నిస్తోందట. ప్రస్తుతం సంయుక్త మీనన్ చేతిలో కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమాతో పాటూ, మరికొన్ని సినిమాలున్నాయ్.
కానీ, శ్రీలీల మాత్రం టాప్ స్టార్స్ సినిమాల్లో సందడి చేస్తోంది. బాలయ్య, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, రామ్.. ఇలా చాలానే ప్రాజెక్టులు శ్రీలీల చేతిలో వున్నాయ్.
సో, తాను కూడా అలాంటి స్టార్ ఛాన్సులు అందుకోవాలని సంయుక్త స్కెచ్ వేస్తోందట. అందుకోసం తన ప్రయత్నాల్లో తానుందనీ తెలుస్తోంది. రెమ్యునరేషన్ సంగతి ఎలా వున్నా, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అనిపించుకోవడమే తన టార్గెట్ అంటోందీ మలయాళ బ్యూటీ.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







