‘ఈగల్’ గా మాస్ రాజా రవితేజ ఇన్ని అవతారాలా.?
- June 13, 2023
మాస్ రాజా రవితేజ నటిస్తున్న సినిమాల టైటిల్స్ వైవిధ్యంగా వుంటున్నాయ్. రీసెంట్‌గా ‘రావణాసుర’ సినిమాతో వచ్చాడు. త్వరలో ‘టైగర్ నాగేశ్వరరావు’ అంటున్నాడు. తాజాగా ‘ఈగల్’ అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశాడు.

కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు, నవదీప్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. టైటిల్ అనౌన్స్ చేస్తూ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఈ గ్లింప్స్‌లో రవితేజను రకరకాల అవతారాల్లో చూపించారు. రా ఏజెన్సీ వెతుకున్నమోస్ట్ వాంటెడ్ పెయింటర్‌గా, పత్తి పండించే రైతుగా, మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు అతనిది అంటూ ఓ పవర్ ఫుల్ వ్యక్తిగా.. ఇలా రకరకాల ఇంట్రడక్షన్స్ ఇచ్చారు.
చూస్తుంటే, ఈ సినిమాతో రవితేజ మరోసారి ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని అర్ధమవుతోంది. ఆ చూపే మరణం, ఆ అడుగే సమరం..’ అంటూ ఓ పవర్ ఫుల్ డైలాగ్ ద్వారా ఈ సినిమా ఒక భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కధాంశంతో రూపొందబోతోందనీ అర్ధమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







