నిద్రమత్తులో డ్రైవింగ్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 16, 2023
యూఏఈ: రోడ్డు పక్కన పనిచేస్తున్న ఎమిరాటీ వ్యక్తిని వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. షార్జాలోని కల్బాలో బుధవారం ప్రమాదానికి దారితీసిన డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేశాడని దర్యాప్తులో తేలింది. ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ అలీ అల్ కే అల్ హమౌడీ మాట్లాడుతూ.. పెట్రోలింగ్లు, పారామెడిక్స్ బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వయస్సు 38 సంవత్సరాలు అని పేర్కొన్నారు. బాధితుడు ఎమిరాటీ కల్బా మునిసిపాలిటీలో పనిచేస్తాడని, తన అధికారిక విధుల్లో భాగంగా అతను వాడి అల్ హెలోలో రోడ్డు పక్కన తన వాహనాన్ని పార్క్ చేసి, బయటకు వెళ్లి తన పనిని చేస్తుండగా వేగంగా వచ్చిన కారు బాధితుడిని ఢీకొట్టిందని చెప్పారు. పోలీసులు డ్రైవర్ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు తెలిపారు. డ్రైవర్లకు అలసటగా అనిపిస్తే సురక్షిత ప్రాంతంలో ఆపి విశ్రాంతి తీసుకోవాలని కల్నల్ డాక్టర్ అల్ హమౌడీ సూచించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







