షార్జాలో భార్య, బిడ్డ ముందే వ్యక్తి ఆత్మహత్య
- June 17, 2023
షార్జా: షార్జాలోని అల్ నహ్దాలోని సహారా సెంటర్ సమీపంలో 35 ఏళ్ల ఆసియా వ్యక్తి వంతెనపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత బుధవారం రాత్రి 9:00 గంటలకు షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఆపరేషన్స్ రూమ్‌కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు పెట్రోలింగ్ మరియు నేషనల్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ వ్యక్తిని వెంటనే అల్ ఖాసిమి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తీవ్ర గాయాల కారణంగా అతను మరణించాడు. మృతుడికి వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన జరిగిన సమయంలో అతడు తన భార్య, బిడ్డతో కలిసి ఇంటికి వెళ్తున్నాడని పేర్కొన్నారు. భార్య వాంగ్మూలం ప్రకారం.. ఆమె భర్తకు ఉద్యోగం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని, వారు తమ బిడ్డతో అల్ నహ్దా పార్క్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, అతను అకస్మాత్తుగా వంతెనపై పైనుండి క్రిందికి దూకినట్లు తెలిపింది. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అతని కుటుంబానికి అందించేందుకు చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లు బుహైరా సమగ్ర పోలీస్ స్టేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







