తానా మహాసభల వేదికపై అస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్
- June 18, 2023
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. తెలుగు సినీరంగంలో పాటల రచయితగా ఉన్న చంద్రబోస్‌ను తానా మహాసభలకు ఆహ్వానించినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు.
తెలుగు పాటను విశ్వ వేదిక మీద నిలబెట్టి భారతదేశం తరఫున ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి గేయ రచయితగా చంద్రబోస్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ పాటను రాసిన చంద్రబోస్‌ను అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఎంతోమంది అభినందించారు. అలాంటి చంద్రబోస్ తో నేరుగా మాట్లాడే అవకాశాన్ని తానా మహాసభలు కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా తానా మహాసభలకు వచ్చి చంద్రబోస్ మాటలను, తెలుగు పాటలోని గొప్పదనాన్ని ఆయన మాటల్లోనే వినండి. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశాన్ని వదులుకోకండి. మహాసభల్లో పాల్గొనేందుకోసం వెంటనే మీ పేర్లను రిజిష్టర్ చేసుకోండి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







