మాస్‌రాజాతో శ్రీలీల.! ‘ధమాకా’ కాంబో ఇంకోస్సారి.!
- June 20, 2023
‘ధమాకా’ సినిమాతో అంతవరకూ వరుస ఫెయిల్యూర్స్‌తో స్ర్టగుల్ అవుతోన్న మాస్ రాజా రవితేజకి మంచి కమ్ బ్యాక్ వచ్చిందని చెప్పొచ్చు. ఇదంతా లక్కీ ఛామ్ శ్రీలీల పుణ్యమే అని అంటారంతా.
అందుకే ఈ లక్కీ ఛామ్తో ఇంకోస్సారి మాస్ రాజా రవితేజ జత కట్టబోతున్నాడట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాని మైత్రీ మూవీస్ బ్యానర్లో రూపొందించనున్నారు. హీరోయిన్గా శ్రీలీల పేరు ఈ సినిమా కోసం వినిపిస్తోంది.
రవితేజ స్వయంగా శ్రీలీల పేరును ప్రపోజ్ చేశాడట. అలాగే మైత్రీ వాళ్లు కూడా ఈ హిట్ కాంబినేషన్‌తోనే తమ ప్రాజెక్ట్ సెట్స్ మీదికెళ్లాలని అనుకుంటున్నారట.
అయితే, శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయ్.
మరి, డేట్స్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో చూడాలి మరి. మరోవైపు రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’ సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







