ప్రభాస్ ఎక్కడా.? ఏం చేస్తున్నాడు.?
- June 20, 2023
ప్రభాస్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం అవ్వాల్సింది ‘ఆదిపురుష్’. ఈ జనరేషన్‌కి రామాయణం యొక్క ప్రాశస్థ్యాన్ని ట్రెండీగా చెప్పాలన్న వుద్దేశ్యంతో తెరకెక్కిన సినిమా ‘అదిపురుష్’.
కానీ, ట్రెండీ టెల్లింగ్ పేరుతో ఇతిహాసాన్ని వక్రీకరించేశారు. దాంతో, విమర్శల పాలైపోయారు ‘ఆదిపురుష్’ టీమ్. ఒక ఎపిక్‌ని టచ్ చేసినప్పుడు అంత ఒళ్లూ పై తెలియకుండా వ్యవహరిస్తారా.? ఇంతలా దిగజారిపోతారా.? అంటూ ‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత అందరి నోటి వెంట వచ్చిన మాటలివే.!
అంతా అయిపోయింది. సినిమా వచ్చింది. పోయింది. మరి, ప్రభాస్ సంగతేంటీ.? సినిమా విషయంలో ఇంత రచ్చ జరుగుతోంది కదా.. ప్రభాస్ ఎక్కడున్నాడు.? అప్పుడెప్పుడో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించాడంతే.
మళ్లీ కనిపించలేదింతవరకూ. ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు ఎక్కడో చోట.. ఏదో ఒక విధంగా తనదైన స్పందన వినిపించాలి కదా.. అటు చూస్తే బాలీవుడ్ మీడియా ప్రభాస్ మీద గుర్రుమంటోందట.
సినిమాని ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా.? అని గుస్సా అవుతోందట. నిర్మాతలిదీ ప్రభాస్ పట్ల ఇదే తీరు అని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







