చైనా-భారత్ సరిహద్దు పరిస్థితి పై స్పష్టం చేసిన ప్రధాని మోదీ
- June 20, 2023
న్యూ ఢిల్లీ: చైనాతో భారత్ మెరుగైన సంబంధాలు ఆచరణలోకి రావాలంటే సరిహద్దుల్లో ప్రశాంతతోనే సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భారతదేశం తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉందని ఆయన అన్నారు. మంగళవారం ఆయన అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనాతో సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికాతో భారత్‌కు ఉన్న బంధం వంటి పలు అంశాలపై ప్రధాని స్పందించారు.
”సార్వభౌమత్యాన్ని, ప్రాదేశిక సమగ్రతలను ఇండిగా బలంగా నమ్ముతుంది. చట్టబద్ధమైన పాలనను పాటిస్తూ, విభేదాలు, వివాదాల విషయంలో శాంతియుత పరిష్కారాన్ని భారత్ కోరుకుంటుంది. ఇదే సమయంలో దేశ సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉంటుంది” అని మోదీ అన్నారు. ఇక మెరికాతో సంబంధాలపై ఆయన స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు న్యూఢిల్లీపై ‘అసాధారణమైన నమ్మకం ఉందన్నారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో విస్తృతమైన పాత్ర పోషించేందుకు భారత్ అర్హమైందని.. విద్య, మౌలిక సదుపాయపై విస్తృత పెట్టుబడులు పెడుతున్నామని, అనేక బహుళజాతి సంస్థలు సైతం తమవైపు చూస్తున్నాయని, ప్రపంచంలో తాము సముచిత స్థానాన్ని దక్కించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
చివరగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడుతూ ‘‘ఈ విషయంలో భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోందని కొందరు అంటున్నారు. అయితే అది సరికాదు. మేము తటస్థంగా లేము. శాంతివైపే ఉన్నాం” అని మోదీ స్పష్టం చేశారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలు, ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వివాదాలు ఉంటే వాటిని దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధంతో కాదని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తాను చాలాసార్లు మాట్లాడానని అన్న ఆయన.. ఘర్షణలను పరిష్కరించి ఇరుదేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని తీసుకు వచ్చేందుకు నిబద్ధతతో జరిగే అన్ని ప్రయత్నాలను భారత్ సమర్ధిస్తుందని మోదీ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







