తగ్గేదేలే అంటోన్న అఖిల్.! మరో రిస్క్‌కి రెడీ అవుతున్నాడా.?
- June 21, 2023
అవునండీ.! హిట్స్. ప్లాప్స్‌తో పని లేకుండా ఎవరైతే టాలీవుడ్‌లో రిస్క్‌ల మీద రిస్క్‌లు చేస్తున్నారో ఆయనే అఖిల్ అని ఈజీగా చెప్పేయొచ్చు. అవును తొలి సినిమా నుంచీ అఖిల్ అన్నీ రిస్క్‌లే చేస్తున్నాడు.
కానీ, ఒక్కటీ కలిసి రావడం లేదు. లేటెస్ట్‌గా ‘ఏజెంట్’తో దెబ్బ తిన్నాడు. అయినా కానీ తగ్గేదేలే అంటున్నాడు. తాజాగా ఓ కొత్త డైరెక్టర్ అఖిల్‌కి కథ చెప్పాడట. నచ్చేసిందట. వెంటనే ఓకే చేసేశాడట.
భారీ బడ్జెట్‌తోనే ఈ సినిమా తెరకెక్కించాలంటున్నాడట. అయితే, అఖిల్‌తో అంత రిస్క్ చేసే నిర్మాత ఎవరు.? ప్రస్తుత పరిస్థితుల్లో. నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత ఈ సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చాడట.
అయితే కొన్ని షరతులు విధించాడట. నాగార్జుననీ నిర్మాణంలో భాగం కమ్మంటున్నాడట. నాగార్జునే వెనక ఆలోచన చేస్తున్నాడనీ తెలుస్తోంది.
మరి.! ‘ఏజెంట్’తో తగిలిని దెబ్బ మామూలు దెబ్బా.? బయటికి రాకుండా తెర వెనకే జాగ్రత్తగా నాగార్జున మేనేజ్ చేసేశాడు. సో, మళ్లీ రిస్క్ అంటే కాస్త ఆలోచించాలి మరి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







