ఆ డైరెక్టర్‌తో నాని ఇంకోస్సారి.! ఈ సారి పక్కా హిట్టే మరి.!
- June 21, 2023
విలక్షణ దర్శకుడిగా పేరున్న వివేక్ ఆత్రేయతో నేచురల్ స్టార్ నాని గతంలో ‘అంటే సుందరానికి’ సినిమా చేశాడు. ఆ సినిమాకి రిలీజ్ ముందు హైప్ తప్ప, సినిమాలో విషయం లేదని ఫ్లాప్ లిస్టులో పడేశారు ప్రేక్షక దేవుళ్లు.
అయితే, ఇంకోసారి ఈ కాంబో రిపీట్ కాబోతోందనీ తాజా సమాచారం. ఈ సారి నానితో ఓ డార్క్ ధ్రిల్లర్ మూవీని ప్లాన్ చేశాడట వివేక్ ఆత్రేయ. ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టి ఫుల్ జోష్ మీదున్నాడు నాని.
ఇదే జోష్‌లో వివేక్ తెచ్చిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసేశాడట. ఈ సినిమాని నిర్మించేందుకు మైత్రీ మూవీస్ మేకర్స్ ముందుకు రావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
‘దసరా’తో నాని మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఆ మార్కెట్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని నిర్మించబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది. అయితే, డీవీవీ దానయ్య పేరు కూడా ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నారనీ తెలుస్తోంది.
చూస్తుంటే, నాని మార్కెట్ గురించే ఈ పోటీ నెలకొందో లేక, కథలోనే అంత పవర్ వుందో తెలీదు కానీ, రెండు బడా నిర్మాతల సంస్థలు ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్స్ హ్యప్నింగ్.!
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







