ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు తెరచి ఉండగానే టేకాఫ్..
- June 22, 2023
న్యూ ఢిల్లీ: ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు మూత తెరచి ఉండగానే టేకాఫ్ అయిన ఘటన సంచలనం రేపింది. ఏలియన్స్ ఎయిర్ కు చెందిన ఏటీ 72-600 విమానం మైసూర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే సమయంలో ఇంధన ప్యానల్ తెరచి ఉండటాన్ని గమనించారు. విమానం ఇంధన ప్యానల్ తెరచి ఉండటంపై ఏటీసీకి సమాచారం అందించారు.
మైసూర్ విమానాశ్రయంలో ఈ విమానంలోకి ఇంధనం నింపలేదు. అయినా ఇంధన ట్యాంకు మూత ఎలా తెరచి ఉందనే విషయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)విచారణకు ఆదేశించింది. మైసూర్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన ఎలియన్స్ ఎయిర్ విమానం వెంటనే తిరిగి విమానాశ్రయానికి వచ్చింది. విమానం ఇంధన ట్యాంకు ప్యానల్ గాలిలో తెరుచుకున్నట్లు చెబుతున్నారు.
ఇలా విమానం ఇంధన ట్యాంకు తెరిచి ఉండటం వల్ల పెద్ద ప్రమాదం జరిగేదని నిపుణులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది.ఈ ఘటనపై విమానయాన సంస్థ ప్రకటన చేయడానికి నిరాకరించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







