'పాస్‌ ఇట్‌ ఆన్‌'కి అద్భుత స్పందన

- May 13, 2016 , by Maagulf
'పాస్‌ ఇట్‌ ఆన్‌'కి అద్భుత స్పందన

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ పరికరాల డిస్ట్రిబ్యూటర్‌ ఎరోస్‌ గ్రూప్‌, 'పాస్‌ ఇట్‌ ఆన్‌' పేరుతో నిర్వహిస్తున్న అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌కి విపరీతమైన స్పందన లభిస్తోంది. మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న ఎలక్ట్రానిక్‌ ఐటమ్స్‌తో పాత వాటి పట్ల ప్రజల్లో ఆసక్తి తగ్గిపోతోంది. వాటిని వృధాగా పారేయకుండా, అవసరమైనవారికి అందిస్తే తద్వారా ఎలక్ట్రానిక్‌ వేస్టేజ్‌ తగ్గించినట్లవుతుంది. అలాగే పేదల్ని ఆదుకున్నట్లు కూడా అవుతుంది. ఈ కాన్సెప్ట్‌తోనే మే 12న వించెస్టర్‌ స్కూల్‌లో పాస్‌ ఇట్‌ ఆన్‌ని నిర్వహించారు. ఇది కేవలం 'డొనేషన్‌' మోడ్‌లోనే కాకుండా, ఎలక్ట్రానిక్‌ వేస్టేజ్‌పై యువత, విద్యార్థుల్లో అవగాహన పెంచడానికీ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. పాడైపోయిన పరికరాల్ని చిన్న చిన్న మరమ్మత్తులతో బాగు చేయించి, వినియోగించడం జరుగుతోంది. 2010 లో ఈ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ని ప్రారంభించగా, ఈ మధ్యకాలంలో క్యాంపెయిన్‌కి విపరీతమైన ప్రాచుర్యం, స్పందన లభిస్తోంది. విద్యా సంస్థలు, కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాల్లో ఈవెంట్స్‌ నిర్వహిస్తూ, పేద కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. 'పాస్‌ ఇట్‌ ఆన్‌' డ్రాప్‌ బాక్స్‌లకు స్పందన బాగా వస్తోందని నిర్వాహకులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com