పిల్లలను కార్ల లోపల ఎప్పుడూ వదలకండి..!
- June 23, 2023
యూఏఈ: వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో పిల్లలను కార్లలో వదిలేయడం చాలా ప్రమాదకరంగా మారిందని యూఏఈ వైద్యులు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు ఇప్పుడు 40-డిగ్రీల మార్కును దాటుతున్నాయి. పార్క్ చేసిన కారు లోపల ఇరుకైన స్థలం, ఎయిర్ కండిషనింగ్ సడెన్ గా పనిచేయడం ఆపివేస్తే అది వారి పాలిట విషాదకరంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో మిగిలిపోయిన పిల్లలు హీట్‌స్ట్రోక్‌కు గురవుతారు, మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుందని మెడ్కేర్ పీడియాట్రిక్ స్పెషాలిటీ సెంటర్, మెడ్కేర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ వఫా ఫైసల్ హెచ్చరించారు. ఈ మేరకు వారు కారులో ఓ ప్రయోగం నిర్వహించారు. కేవలం ఐదు నుండి ఆరు నిమిషాలు లాక్ అయిన కారులో ఏసీ పనిచేయకపోతే విపరీతంగా చెమటలు పడతాయి. కొంత సమయం తర్వాత, తల తిరగడం, గందరగోళ స్థితిని కూడా అనుభవిస్తారని ప్రయోగం అనంతరం తెలిపారు. కేవలం 15 నిమిషాల్లోనే కారులోపల ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరుకుందన్నారు. తీవ్రమైన వేడి కారణంగా గుండె వేగంగా కొట్టుకొని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని వివరించారు.
2019 లో దుబాయ్‌లోని అల్ క్వోజ్ ప్రాంతంలో ఆరేళ్ల ఆసియా బాలుడు చాలా గంటలు బస్సులో చిక్కుకుపోయిన మరణించాడు. అదే సంవత్సరంలో అబుధాబిలో ఇద్దరు ఎమిరాటీ పిల్లలను వదిలివెళ్లిన వాహనం మంటల్లో చిక్కుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. 2017లో ఆరేళ్ల ఎమిరాటీ బాలిక ఆరు గంటల పాటు కారులో ఒంటరిగా ఉండిపోవడంతో మరణించిన ఘటన కూడా 2017లో నమోదైంది. అజ్మాన్‌లో ఇద్దరు నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు సోదరీమణులు, వారి తండ్రి కారులో ప్రమాదవశాత్తూ లాక్ కావడంతో చనిపోయారు.
తాజా వార్తలు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!







