వావ్.! భలే ఛాన్స్ కొట్టేసిన ‘ఏజెంట్’ భామ.!
- June 23, 2023
తొలి సినిమా డిజాస్టర్ అయినా ‘ఏజెంట్’ బ్యూటీ సాక్షి వైద్యకి అవకాశాలు బాగానే వచ్చేస్తున్నాయ్. అందులోనూ ప్రెస్టిజియస్ ఆఫర్లు అమ్మడి తలుపు తడుతుండడం విశేషం.
‘ఏజెంట్’ రిజల్ట్‌తో సంబంధం లేకుండానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ‘గాంఢీవధారి అర్జున’ సినిమాలో ఆల్రెడీ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పుడు లేటెస్ట్గా మరో మెగా ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన. పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో సాక్షి వైద్యను హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదేంటీ.! ఆల్రెడీ ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కదా.. అనుకుంటున్నారా.? ఈ సినిమాలో ఇంకో హీరోయిన్‌కీ ఛాన్సుందట. ఆ ప్లేస్ కోసమే తాజాగా సాక్షి వైద్య పేరు తెరపైకి వచ్చింది. ఒకవేళ నిజమే అయితే, ఈ బ్యూటీ కెరీర్ ఇక తిరిగి చూసుకోనక్కర్లేదు. చూస్తుంటే, నక్క తోక తొక్కే వచ్చినట్లుందిలే సాక్షి వైద్య.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







