షాకింగ్.! రష్మికను మోసం చేసిన మేనేజర్.!

- June 23, 2023 , by Maagulf
షాకింగ్.! రష్మికను మోసం చేసిన మేనేజర్.!

సెలబ్రిటీల గుట్టు మట్టులన్నీ వారి వారి మేనేజర్ల చేతిలోనే వుంటాయంటారు. అందుకే చాలా నమ్మకమున్న వ్యక్తులనే తమ మేనేజర్లుగా నియమించుకుంటుంటారు సెలబ్రిటీలు. తాజాగా రష్మిక మండన్నా మేనేజర్, ఆమెని మోసం చేసి 80 లక్షలు కొట్టేశాడట.
సాధారణంగా ఇలాంటి న్యూస్ బయటికి రావు. కానీ, ఈ న్యూస్ బయటికి పొక్కేసింది. దాంతో వెంటనే రష్మిక అండ్ టీమ్ అలర్ట్ అయిపోయారు. అలాంటిదేమీ లేదంటూ ఓ లేఖ రిలీజ్ చేశారు. మ్యూచువల్ అండర్ స్టేండింగ్‌తోనే వారిద్దరూ విడిపోయారనీ గొడవలేమీ లేవనీ ఓ మెసేజ్ రిలీజ్ చేశారు.
గొడవల్లేవ్ సరే, మరి ఆ 80 లక్షల మాటేంటీ.? రష్మిక ఎలా మోసపోయింది.? అవునులే, రష్మిక ప్రస్తుతం చాలా బిజీ. తన ప్రాజెక్టులతో సౌత్, నార్త్ షటిల్ సర్వీసులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. 
ఇలాంటివి పట్టించుకునే టైమ్ లేదు. సందట్లో సడేమియా.. అన్నట్లుగా ఆ మనేజర్ మోసం చేసినట్లున్నాడు. అయితే, మనీ మ్యాటర్ క్లారిటీ లేదు కానీ, ఆ మేనేజర్‌ని అయితే రష్మిక పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com