తెలంగాణలో లులు గ్రూప్ రూ.3,500 కోట్ల పెట్టుబడులు
- June 26, 2023
హైదరాబాద్: తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది.తెలంగాణలో లులు గ్రూప్ రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫుడ్ ఫ్రాజెసింగ్ యూనిట్ ను లులూ గ్రూప్ తెలంగాణ లో ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో దశలవారీగా రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టటానికి ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగా బేగంపేట్ లోని ఐటిసి కాకతీయ హోటల్ లో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీతో సమావేశమయ్యారు.
పెట్టుబడులు ఒప్పందంలో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర వన్ గా ఉందని..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ అని తెలిపారు. ఇండియాలోనే అతి పెద్ద ఆక్వా హబ్ గా తెలంగాణ సిద్ధమవుతోందన్నారు. తెలంగాణలో హరిత విప్లవం, నీలి విప్లవం దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థ లులూ గ్రూప్ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు తోపాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతోందని అన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోనే ఉండదని..త్రివేండ్ రెవల్యూషన్ వై ట్రివల్యూషన్ థింక్ రెవల్యూషన్ ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందుందని తెలిపారు.
తెలంగాణలో లులూ గ్రూప్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్ పోర్టు కేంద్రాన్ని రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని..రూ.300 కోట్లతో హైదరాబాద్ లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నామని లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ లలో షాపింగ్ మాల్ ప్రారంభించనున్నామని తెలిపారు.ఇప్పటికే లులూ మాల్ కు సంబంధించి 80% పని పూర్తి అయిందని వెల్లడించారు.తెలంగాణ నుంచి బియ్యాన్ని సేకరించబోతున్నామని..తెలంగాణ లో మీట్ ప్రోసెసింగ్ యూనిట్, ఫిష్ ప్రోస్సేసింగ్ యనిట్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. దావోస్ లో అందుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నామని లులూ గ్రూప్ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







