సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని ప్రారంభించిన హైదరాబాద్ విమానాశ్రయం
- June 26, 2023
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గేట్ ఎంట్రీ నంబర్ 9 సమీపంలో సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మెరుగైన సామధ్యం తో అంతరాయం లేని ప్రయాణాన్ని పెంచడానికి, విమానాశ్రయం ఎనిమిది పూర్తి ఆటోమేటెడ్ సెల్ఫ్-బ్యాగేజ్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ఈ యంత్రాల్లో స్కానర్లు, స్కేల్స్, సెన్సర్లు అమర్చి ప్రయాణికులు తమ బ్యాగేజీ చెక్ ఇన్ సదుపాయాన్ని 45-60 క్షణాల్లోనే పూర్తి చేసుకోవచ్చు.
ఈ కొత్త సర్వీస్ గురించి జిహెచ్ఐఎఎల్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, "హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించే ప్రయాణీకుల కోసం కొత్త సెల్ఫ్ బ్యాగేజ్ సదుపాయం యొక్క మరొక సౌలభ్యాన్ని జోడించడం మాకు సంతోషంగా ఉంది. సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ మరియు చెక్ ఇన్ ప్రాసెస్ యొక్క టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ప్రయాణాన్ని వేగవంతం మరియు సులభతరం చేయటమే కాకుండా ప్రయాణీకుల అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెడుతూనే, మా ప్రయాణీకులందరికీ ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.”
సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ ఉపయోగించడానికి శీఘ్ర గైడ్:
స్టెప్ 1: సెల్ఫ్ చెక్ ఇన్
బోర్డింగ్ పాస్ ప్రింట్ చేయడానికి ప్రయాణికులు కియోస్క్ లో సెల్ఫ్ చెక్ చేసుకుంటారు. కియోస్క్ వద్ద వారు బ్యాగేజ్ ఆప్షన్ను ఎంచుకుని, బ్యాగుల సంఖ్య, బరువు వంటి వివరాలను అందించి, బ్యాగ్ ట్యాగ్ను ప్రింట్ తీసుకుంటారు.
స్టెప్ 2: సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్
బ్యాగేజీ ట్యాగింగ్ తర్వాత, ప్రయాణికులు సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ యూనిట్కు వెళ్తారు. వారు బ్యాగేజీని కన్వేయర్ బెల్ట్ పై ఉంచుతారు మరియు బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ప్రారంభించడానికి వారి బోర్డింగ్ పాస్ లోని బార్ కోడ్ ను స్కాన్ చేస్తారు. సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ యూనిట్ బ్యాగ్పై తనిఖీలు చేసి అంతా సక్రమంగా ఉంటే, బ్యాగ్ను ప్రాసెస్ చేసి విమానయాన సంస్థకు ఆమోదాన్ని పంపుతుంది. ఒకవేళ బ్యాగేజ్ అవసరమైన ప్రమాణాలను అందుకోనట్లయితే, సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ యూనిట్ దానిని తిరస్కరించి చెక్-ఇన్ ఏజెంట్ నుండి సహాయం పొందమని ప్రయాణికుడికి తెలియజేస్తుంది.
ఒకవేళ అదనపు బ్యాగేజీ ఉంటే ప్రయాణికుడు విమానయాన సంస్థకు చెందిన బ్యాగేజ్ కౌంటర్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది. తొలుత బెంగళూరు, చెన్నై వెళ్లే ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







