బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్ వద్దు బాబోయ్.!
- June 26, 2023
ఈ పాటికే బుల్లితెరపై బిగ్‌బాస్ 7వ సీజన్ స్టార్ట్ అవ్వాల్సి వుంది. కానీ, ఎందుకో ఈ సారి ఆలస్యమైంది. హోస్ట్ విషయంలో జరుగుతున్న రగడ కావచ్చు.. నిర్వాహకుల్లో అసలు షో విషయంలోనే ఆసక్తి లేకపోవడం కావచ్చు.. కారణాలేమైనా ఇంతవరకూ బిగ్‌బాస్ అలికిడి లేదనే చెప్పొచ్చు.
అయితే, రీసెంట్గా హిందీ బిగ్‌బాస్ స్టార్ట్ అవ్వడంతో తెలుగులోనూ బిగ్‌బాస్ వీక్షకుల్లో ఒకింత ఆసక్తి నెలకొంది. దాంతో, తెర వెనక బిగ్‌బాస్ షోకి ఏర్పాట్లు వేగవంతం చేశారనీ తెలుస్తోంది.
అయితే, ఈ సారి హోస్ట్ విషయంలో కొంత డైలమా నెలకొందనీ తెలుస్తోంది. నాగార్జున హోస్టింగ్ పట్ల ఫ్యాన్స్ అంతగా ఆసక్తిగా లేరనీ తెలుస్తోంది. ఆసక్తి కాదు కదా.. అసలు నాగ్ని హోస్ట్‌గా వద్దు బాబోయ్ వద్దంటున్నారట.
దాంతో, రానా పేరు ఈ సారి బిగ్‌బాస్ సీజన్ హోస్ట్‌గా ప్రచారంలో వుంది. గతంలోనూ రానా పేరు పరిశీలించడం జరిగింది. కానీ, లాస్ట్ మినిట్‌లో మళ్లీ నాగార్జునే హోస్ట్‌గా ఫిక్సవ్వాల్సి వచ్చింది. ఇప్పుడేం జరుగుతుందో చూడాలిక.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







