‘ప్రాజెక్ట్ కె’లో విశ్వనటుడు కమల్ హాసన్.! ప్రభాస్ డ్రీమ్ నెరవేరిపోయిందే.!
- June 26, 2023
విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం అంటే నిజంగా అదృష్టమే అని చెప్పాలి. ఆ అదృష్టం ఇప్పుడు ప్రభాస్ ని వరించినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో కమల్ హాసన్ నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వనీ దత్ తెరకెక్కిస్తున్న ఈ బడా ప్యాన్ ఇండియా ఫ్రాజెక్టులో ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తుండగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొనె, దిశా పటానీ నటిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ పేరు ఖరారయ్యింది.
కమల్‌తో స్కీన్ షేర్ చేసుకోవాలన్నది తన డ్రీమ్ అనీ, ఆ డ్రీమ్ ఇలా ఫుల్ ఫిల్ అవుతున్నందుకు చాలా సంతోషంగా వుందని ప్రభాస్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







