శ్రీవిష్ణుకి చిరంజీవి ఊతమందిస్తాడా.?
- June 26, 2023
విలక్షణ నటుడిగా, పక్కింటబ్బాయ్‌గా శ్రీ విష్ణుకి మంచి పేరుంది. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా అందుకే శ్రీ విష్ణు సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుందని చెప్పొచ్చు.
తాజాగా ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీ విష్ణు. శ్రీ విష్ణు సరసన రెబా మోనిక హీరోయిన్‌గా నటిస్తోంది.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. సినిమాలోని హిలేరియస్ కామెడీని చిరంజీవి చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
తనలాగే ఆడియన్స్ కూడా ఈ సినిమాని వీక్షించి బాగా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి తెలిపారు. జూన్ 29న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మెగాస్టార్ చేతుల మీదుగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. రిజల్ట్ విషయంలోనూ అలాంటి రెస్పాన్సే వస్తుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







