మహారాష్ట్రలో ఎందుకు అభివృద్ధి సాధ్యం కాదు? సిఎం కెసిఆర్
- June 27, 2023
మహారాష్ట్ర: కేవలం ఐదారు సంవత్సరాల కాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని బిఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. అలాంటిది అన్ని వనరుల పుష్కలంగా ఉన్న మహారాష్ట్ర మాత్రం అభివృద్ధిలో వెనుకబడడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకుని ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. మంగళవారం మహారాష్ట్రలోని సర్కోలిలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ బిజెపికి బీటీమ్ అని ప్రచారం చేస్తున్నారని, తాను ఎవరికీ ఏ టీమ్ కాదు, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. రైతులంతా బిఆర్ఎస్ తో ఉంటే మిగతా పార్టీలే మనకు బీ టీమ్ లుగా మారుతాయని చెప్పారు. బిఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని కెసిఆర్ కొత్త నిర్వచనం చెప్పారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాలలో 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించిందని కెసిఆర్ చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన భాజాపా.. అందరికీ మీరు అవకాశం ఇచ్చారని చెప్పారు. రైతులకు మంచి చేయాలని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉంటే వీళ్లలో ఎవరైనా చేయగలిగే వారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేని వాళ్లకు అధికారం కట్టబెట్టొద్దని అన్నారు. బిఆర్ఎస్ మాత్రమే రైతుల పక్షాన నిలుస్తుందని, అభివృద్ధి చేసి చూపెడుతుందని పేర్కొన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ ముందుకు వెళుతున్నామని కెసిఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







