ఇమారా హెల్త్ కేర్‌లో ICBF వైద్య శిబిరం విజయవంతం
- June 27, 2023
ఖతార్: ఇమారా హెల్త్ కేర్‌లో ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) నిర్వహించిన 45వ వైద్య శిబిరం విజయవంతం అయింది. దాదాపు 400 తక్కువ-ఆదాయ వ్యక్తులు శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. వైద్య శిబిరాన్ని ఇండియన్ ఎంబసీ ఫస్ట్ సెక్రటరీ HE ఛార్జ్ డి అఫైర్స్ ఏంజెలిన్ ప్రేమలత ప్రారంభించారు. సుమన్ సోంకర్ (ICBF సమన్వయ అధికారి) ఈవెంట్ ను పర్యవేక్షించారు. ఇంటర్నల్ మెడిసిన్, E.N.T, ఓరల్ స్క్రీనింగ్, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ మరియు ఫిజియోథెరపీ విభాగం డాక్టర్లు అవసరమైన వారికి వైద్య సేవలను అందించారు. వైద్య శిబిరంలో ఫార్మసీ సేవలను Q లైఫ్ ఫార్మా, IPhAQ (ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఖతార్) అందించింది. ఈ ఈవెంట్లో సుమారు 20 మంది విద్యార్థి వాలంటీర్లు పాల్గొని సేవలు అందించారు. ఈ సందర్భంగా అల్ ఇమారా మెడికల్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ అష్రఫ్ చెరకల్, చైర్మన్ డాక్టర్ అమీన్ లకు ICBF సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శిబిరాన్ని సందర్శించిన అపెక్స్ బాడీ అధ్యక్షులు, సంఘం నాయకులు, ICBF సలహా మండలి సభ్యులు, AO అధ్యక్షులు మద్దతు తెలిపారు. ఈ వైద్య శిబిరం విజయవంతం కావడం ఐక్యత, కరుణ, స్వచ్ఛంద సేవా శక్తికి నిదర్శనమని ICBF ఒక ప్రకటనలో పేర్కొంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







