ప్రపంచంలోనే తొలి ఎగిరే కారు..అమెరికా ప్రభుత్వం ఆమోదం

- July 01, 2023 , by Maagulf
ప్రపంచంలోనే తొలి ఎగిరే కారు..అమెరికా ప్రభుత్వం ఆమోదం

అమెరికా: అమెరికాలో ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం నుంచి చట్టబద్ధ అనుమతి లభించిందని కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్‌ ఏరోనాటిక్స్‌ కంపెనీ ప్రకటించింది. US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుండి ప్రత్యేక ఎయిర్‌వర్థినెస్ సర్టిఫికేషన్‌ ను పొందామని తెలిపింది.

ఎందుకంటే గాల్లో ఎగిరే కారు తయారు చేసింది కాలిఫోర్నియాకు చెందిన అలీఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ..! ఇది ప్రపంచంలో ఎగిరే తొలి కారు..!! ఈ ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..ఈ కారుకున్న మరో ప్రత్యేక ఏంటీ అంటూ ఈకారు రోడ్ల మీదా…గాల్లోను కూడా దూసుకుపోయే వెరీ వెరీ సూపర్ కారు.. ఇటువంటి తరహా వాహనానికి అమెరికా ప్రభుత్వం అనుమతి ఇవ్వటం కూడా ఇదే మొదటిసారి. ఈ మోడల్‌-ఎ ఫ్లయింగ్‌ కారుఒక్కసారి ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే 177 కిలోమీటర్ల వరకు గాలిలో ప్రయాణించవచ్చట ఈ కారులో. అదే రోడ్డు మీద అయితే 322 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనమైన ఈ కారు ధర 300,000 డాలర్లు కాదు ఇది భారత కరెన్సీలో రూ.2.46 కోట్లు..పైనే..!

శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండే ధర ఇది అనే చెప్పుకోవాలి. మరి దీన్ని వెంటనే కొనేసుకుందామంటే మాత్రం కుదరదు. ఎందుకంటే 2025 నుంచి ఇలాంటి కార్ల ఉత్పత్తి ప్రారంభిస్తామంటోంది ఆ కంపెనీ. కాలిఫోర్నియాకు చెందిన అలీఫ్‌ ఏరోనాటిక్స్‌ కంపెనీ తయారు చేసిన ‘మాడల్‌ ఏ’ కారు

ఎలక్ట్రిక్ వర్టీకల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వాహనం అని పిలిచే ఈ ప్లయింగ్ కారును మొదటిసారి 2022 అక్టోబర్ లో అలెఫ్ కంపెనీ ఆవిష్కరించింది. ఈ కారు 2025 చివరినాటికి అందుబాటులోకి వస్తుందని అప్పుడే ఈ కార్లను డెలివరీ ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అలెఫ్ చరిత్రలో మొట్టమొదటి ఎగిరే కారును అందించాలని టార్గెట్ గా పెట్టుకున్నామని..దీని కోసం ముందుగా ఆర్డర్లను తీసుకున్నాకే ఉత్పత్తి ప్రారంభిస్తామని అలెఫ్ కంపెనీ సీఈవో జిమ్ దుఖోవ్నీ తెలిపారు. జనవరిలో 440కి పైగా ముందస్తు ఆర్డర్ చేయబడ్డాయని తెలిపారు. మోడల్‌-ఎ కార్ల ఉత్పత్తిని 2025 నుంచి పూర్తిస్థాయిలో కార్ల తయారీ ప్రారంభిస్తామని..ఏడాది చివరినాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com