నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 'జగనన్న సురక్ష' ప్రారంభం
- July 01, 2023
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ' జగనన్న సురక్ష ' కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ప్రజల వినతులను పరిష్కరించడం, అర్హులందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన 'జగనన్న సురక్ష' ద్వారా నేటి నుంచి సచివాలయాలవారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులకు సర్టిఫికెట్లను ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు.
జూలై 1వ తేదీ నుంచి 31 వరకు...
జగనన్న సురక్ష కార్యక్రమం కింద జూలై 1వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నెల రోజుల పాటు నిర్దేశిత తేదీల్లో ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక క్యాంపులలో అందే వినతులను అత్యంత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఏడు రోజుల ముందే దరఖాస్తులను స్వీకరించడంతోపాటు టోకెన్లను కూడా జారీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 9.48 లక్షల టోకెన్లు జారీ కాగా 6.77 లక్షల వినతుల వివరాలను సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లు కంప్యూటర్లలో నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అప్పటికప్పుడే పరిష్కారానికి అవకాశం ఉన్న 2.65 లక్షల వినతులకు సంబంధించి క్యాంపు నిర్వహణకు ముందే అధికారుల స్థాయిలో ఆమోద ప్రక్రియ పూర్తయ్యాయి.
తొలి రోజు 1,306 సచివాలయాల పరిధిలో క్యాంపులు...
తొలిరోజు జూలై 1వ తేదీన 1,306 సచివాలయాల పరిధిలో క్యాంపులు జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఆయా సచివాలయాల పరిధిలోని వలంటీర్లు జూన్ 24వ తేదీనే ఇంటింటికీ వెళ్లి క్యాంపుల సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఆయా కుటుంబాల నుంచి వ్యక్తిగత వినతుల వివరాలను సేకరించారు. తొలిరోజు క్యాంపులకు సంబంధించి 14,29,051 కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శుక్రవారం ఎస్‌ఎంఎస్ రూపంలో కూడా సమాచారాన్ని పంపింది. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రత్యేక క్యాంపులకు సంబంధించి 11 రకాల ప్రధాన ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలను వసూలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







