తగ్గిన పసిడి ధర

- May 14, 2016 , by Maagulf
తగ్గిన పసిడి ధర

బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గింది. రూ.25 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.30,025కు చేరింది. ప్రపంచ మార్కెట్లలో ధర పెరుగుతున్నప్పటికీ దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కీలక సమయాల్లో కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.76శాతం పెరిగి 1,272.80 అమెరికన్‌ డాలర్లకు చేరింది.
అయితే శనివారం వెండి ధర మాత్రం చెప్పుకోదగ్గరీతిలో పెరిగింది. ఈ ఒక్కరోజే రూ.425 పెరగడంతో కేజీ వెండి ధర రూ.40,925కు చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com