జులై 11న ఐదు గంటలపాటు శ్రీవారి దర్శనాలు నిలిపివేత
- July 04, 2023
తిరుమల: తిరుమలలో జులై 11న శ్రీవారి దర్శనాలను ఐదు గంటలపాటు నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జులై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. జులై 17న ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం 5 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐడు గంటల పాటు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
తిరుమంజనం అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం 12గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







