మెగా డబుల్ ధమాకా.! ఒకే స్క్రీన్ పై అన్నదమ్ములిద్దరూ.!
- July 05, 2023
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఎలా వుంటుంది.? గతంలో ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ఈ కాంబోని కొన్ని సెకన్ల పాటు స్క్రీన్ పై చూశాం. ఆ తర్వాత మళ్లీ ఆ అవకాశం కోసం ఎంత ప్రయత్నించినా ఇంతవరకూ జరగలేదు.
కానీ, ఇప్పుడు అందుకు అవకాశమొచ్చిందా.? అంటే ఒకింత అవుననే చెప్పాలి. ఒకే స్క్రీన్ పై ఈ ఇద్దరూ కనిపించే అవకశాశముంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్. ఒకే స్క్రీన్ పై కనిపిస్తారు. కానీ, కలిసి కాదు. ఏంటా ట్విస్ట్ అనుకుంటున్నారా.?
ఈ నెల 28న ‘బ్రో’ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇదే రోజు, ఈ సినిమా రిలీజ్ కాబోయే ధియేటర్లలోనే మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు.
అలా ఈ ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఒకే ధియేటర్లో ఇద్దరు అభిమాన హీరోల్ని ఒకేసారి చూసే అవకాశం.. మెగా అభిమానులకు ఇది నిజమైన పండగే కదా. మెగా డబుల్ ట్రీట్ అంటే ఇదే మరి.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







