షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత.? సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందా.?
- July 05, 2023
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా చెలామణీ అవుతోన్న సమంత నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. సమంత తాను ఒప్పుకున్న సినిమాలకు అడ్వాన్స్ తిరిగిచ్చేస్తోందట అనేది ఆ షాకింగ్ న్యూస్. అంటే, సమంత సినిమాలకు దూరమైపోతోందన్నదే ఆ న్యూస్ సారాంశం.
‘యశోద’ సినిమా టైమ్‌లో సమంత ఆనారోగ్యంతో బాధపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ‘శాకుంతలం’ సినిమాని ఎలాగో కష్టపడి పూర్తి చేసింది. కానీ, ఈ రెండు సినిమాల రిజల్ట్ సమంతకు అనుకూలంగా రాకపోవడంతో, ఆమె గ్రాఫ్ కాస్త తగ్గిందనే చెప్పొచ్చు.
కానీ, సమంత ఇప్పుడూ అప్పుడూ ఎప్పుడూ స్టార్ సెలబ్రిటీనే. సమంతకు సంబంధించిన ఏ న్యూస్ అయినా అదో సెన్సేషనే. అయితే, తాజాగా సమంత సినిమాలకు దూరమవుతోందట అనే న్యూస్ మాత్రం ఇటు ఫ్యాన్స్ కానీ, అటు సినీ వర్గాలు కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయ్.
సమంత ప్రస్తుతం ‘ఖుషీ’ సినిమాలో నటిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. అలాగే, ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది. ఈ రెండూ కాక మరే కొత్త ప్రాజెక్ట్ పైనా సమంత సైన్ చేయలేదు. తన పర్సనల్ లైఫ్‌లో దృష్టి పెట్టడం కోసమే కొన్నాళ్ల పాటు సమంత సినిమాలకు దూరంగా వుండాలని అనుకుంటోందట.
ఆ నేపథ్యంలోనే కొత్త ప్రాజెక్టులేమీ ఒప్పుకోకూడదని నిర్ణయించుకుందట.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







