సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో విష వాయువు లీక్..
- July 05, 2023
అమరావతి: అమరావతిః ఏపిలోని ప్రకాశం జిల్లాలో విష వాయువు లీక్ కావడం భయాందోళనలు సృష్టించింది. వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చేపల ప్రాసెసింగ్ సమయంలో అమ్మోనియం వాయువు లీక్ అయింది. ఈ వాయువు పీల్చి అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఫ్యాక్టరీ ప్రతినిధి తెలిపారు.
కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఒంగోలు లోని రిమ్స్ లో చేర్పించినట్లు పేర్కొన్నారు. బాధిత కార్మికులంతా ఒరిస్సాకు చెందిన వారేనని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు కూడా తెలియరాలేదు.. అయితే, బాధితులు అందరినీ ఎమర్జెన్సీ వార్డులో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!







