గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే కానీ.! జర జాగ్రత్త అవసరం సుమా.!

- July 05, 2023 , by Maagulf
గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే కానీ.! జర జాగ్రత్త అవసరం సుమా.!

ఈ మధ్య గ్రీన్ టీకి భలే డిమాండ్ పెరిగింది. ఆరోగ్య రీత్యా గ్రీన్ టీ మంచి ఫలితాల్నిస్తుండడమే అందుకు కారణం. అధిక బరువును తగ్గించడంలోనూ డయాబెటిస్, అధిక రక్తపోటు తదితర అనారోగ్య సమస్యలను అదుపులో వుంచుతుండడంతో, ఈ టీ తాగేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

అయితే, విచ్చలవిడిగా గ్రీన్ టీ తాగడం వల్ల అనేక అనర్ధాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల అందులోని ఆయుర్వేద గుణాలు శరీరంలోని ఇతర అవయవాలపై చెడు ప్రభావం చూపించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

పరగడుపుతో మాత్రమే గ్రీన్ టీ తీసుకోవాలి. ఆహారం తీసుకున్న వెంటనే గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయ్. అంతేకాకుండా, ఆహారం తీసుకున్న వెంటనే గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని ఐరన్ లోపించే ప్రమాదముందట.

అలాగూ అతిగా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదమున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో ఒక్కసారి.. లేదంటే రెండు సార్లు (విత్ గ్యాప్) మాత్రమే గ్రీన్ టీ ఆరోగ్యం. అతి సర్వత్రా వర్జయేత్. ఆరోగ్యానికి మంచిది కదా.. అని అతిగా తీసుకుంటే అంతే సంగతి. ప్రమాదం తప్పదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com