‘సలార్’తో ప్రబాస్.! వన్స్‌మోర్ డిజప్పాయింట్‌మెంట్.!
- July 06, 2023
ప్యాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ ప్రబాస్ పాలిట అదృష్టమో, దురదృష్టమో తెలియని అగమ్య గోచర పరిస్థితి. ట్యాగ్ అయితే తగిలించుకున్నాడు. కానీ, ఆ స్థాయిని నిలబెట్టుకోవడం ప్రబాస్‌కి కత్తి మీద సామే అయ్యింది.
ప్యాన్ ఇండియా స్టాయితో సినిమాలయితే వస్తున్నాయ్ కానీ, విజయాలైతే వరించడం లేదు ప్రబాస్‌కి. మొన్నటికి మొన్న ‘ఆది పురుష్’ సినిమాతో నలుగురిలో నవ్వుల పాలయ్యాడు ప్రబాస్.
ఇప్పుడు ‘సలార్’తో ఏదో చించేస్తాడు.. పొడిచేస్తాడు.. అనుకుంటే, మళ్లీ నిరాశే ఎదురైంది. ఇంతకాదు.. అంతకాదు.. అంటూ ‘సలార్’ టీజర్‌పై కొండంత ఆశలు పెట్టుకున్నారు ప్రబాస్ ఫ్యాన్స్.
వారి ఆశలన్నీ నట్టేట్లో మునిగిపోయాయ్. టీజర్ వచ్చింది. కానీ ఏం లాభం.? అది ‘సలార్’ టీజరే. కానీ, హీరో ఎవరు.? అని వెతుక్కునే పరిస్థితి ఫ్యాన్స్‌ది. కొన్ని సెకన్న వీడియో కట్ చేశారు బాగానే వుంది. సింపుల్ ఇంగ్లీష్.. లయన్, చీటా.. ఎలిఫెంట్.. జురాసిక్ పార్క్.. అని ఓ సీనియర్ బాలీవుడ్ నటుడితో డైలాగులు చెప్పించారంతే.
అందులో మన హీరో ఎక్కడా కనిపించలేదు. ఓ పిడికిలి చాటు నుంచి కనీ కనిపించకుండా హీరోని రివీల్ చేశారు. వేరెవరికో టీజర్‌లో ఎలివేషన్ ఇచ్చారు కానీ, కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మన హీరో గారి దర్శన భాగ్యాన్ని అభాగ్యమే చేసేశారు. ఇదీ ప్రబాస్ ఫ్యాన్స్ ఒపీనియన్ ‘సలార్’ టీజర్‌పై.

తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్