1.1 మిలియన్ దిర్హాంల విలువైన ఆభరణాలు చోరీ.. 12 గంటల్లో ముగ్గురు నిందితులు అరెస్ట్
- July 08, 2023
యూఏఈ: 1.1 మిలియన్ దిర్హామ్‌ల విలువైన బంగారు ఆభరణాలు, 40,000 దిర్హామ్‌ల నగదును అపహరించిన ముగ్గురు నిందితులను కేవలం 12 గంటల వ్యవధిలో అజ్మాన్ పోలీసులు పట్టుకున్నారు. అజ్మాన్ పోలీస్‌లోని ఆపరేషన్ గదికి బంగారు దుకాణం నుండి దొంగతనం జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే ఒక బృందాన్ని అధికారులు ఏర్పాటు చేసారు. ముగ్గురు నిందితులు పలుమార్లు బట్టలు మార్చుకుని, ముసుగులు ధరించి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఏజీ, టీడీ, ఎస్‌ఏగా గుర్తించిన ముగ్గురు అరబ్ నిందితులను గుర్తించిన అధికారులు పట్టుకోగలిగారు. షార్జా పోలీసుల సహాయంతో మొదటి వ్యక్తిని పట్టుకున్నారు. రెండో నిందితుడు అజ్మాన్‌లోని రుమైలాలో టీడీ, అజ్మాన్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో దోపిడీకి ప్లాన్ చేసి నడిపించిన మూడో నిందితుడు ఎస్ఏని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు తమ నేరాలను అంగీకరించారు. వారి నుండి 1.1 మిలియన్ దిర్హాంల విలువైన బంగారు ఆభరణాలు, 40,000 దిర్హామ్ నగదును రికవరీ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిఘా ఉంచి, అటువంటి నేరస్థులతో కఠినంగా వ్యవహరిస్తామని అజ్మాన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







