ఎమిరేటైజేషన్: జూలై 8 నుండి Dh42,000 జరిమానా విధింపు
- July 08, 2023
యూఏఈ: అర్ధ-వార్షిక ఎమిరటైజేషన్ గడువును చేరుకోని సంస్థలకు జూలై 8 నుండి జరిమానాలు విధించనున్నట్టు యూఏఈ మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రైవేట్ రంగ సంస్థలకు నైపుణ్యం కలిగిన పాత్రల్లో పనిచేస్తున్న ఎమిరాటీల సంఖ్యలో 1 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడానికి జూలై 7 తుది గడువు అని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. కంప్లైంట్ చేయని ఎంటిటీలు 2022 నుండి మిగిలిన ఆర్థిక సహకారాలతో పాటు ఉద్యోగం చేయని ప్రతి ఎమిరాటీకి Dh42,000 ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్/జరిమానా విధిస్తారని MoHRE ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీలు 2026 వరకు ప్రతి సంవత్సరం తమ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం ఎమిరాటీలను చేర్చుకోవాలి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో 1 శాతం, మరో అర్ధ బాగంలో మరో 1 శాతం సాధించాలి. ఈ సంవత్సరం అరాఫత్ డే, ఈద్ అల్ అదా సెలవులను పరిగణనలోకి తీసుకుని జూన్ 30 నుండి జూలై 7 వరకు సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి మంత్రిత్వ శాఖ గడువును పొడిగించింది. 2022 నాటి తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన ప్రైవేట్ కంపెనీలనుంచి మంత్రిత్వ శాఖ 400 మిలియన్ దిర్హామ్‌ల జరిమానాను వసూలు చేసింది. మేలో విడుదల చేసిన డేటా ప్రకారం, తప్పనిసరి ఎమిరేటైజేషన్ డ్రైవ్ ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే యూఏఈ పౌరుల సంఖ్యను పెంచడంలో సహాయపడింది. 66,000 కంటే ఎక్కువ మంది ఎమిరాటీలు ఇప్పుడు ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







