ఎక్స్పో 2023 దోహాకు ఆతిథ్యం ఇవ్వడానికి ఖతార్ సంసిద్ధం
- July 08, 2023
Dohaదోహా: ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎక్స్పో 2023 దోహాకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో, వరల్డ్ ఎక్స్పోస్ను పర్యవేక్షించే మరియు నియంత్రించే బాధ్యత కలిగిన సంస్థ బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్‌పోజిషన్స్ (BIE)కి చెందిన సీనియర్ అధికారి మాట్లాడారు. ఎక్స్పో 2023 దోహా నిర్వహణకు ఖతార్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుందని చెప్పారు. ప్రసిద్ధమైన ఈ ఆరు నెలల ఈవెంట్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. అర్ధ-సంవత్సరం ఈవెంట్‌కు సంబంధించి తాజా పరిణామాలను అంచనా వేయడానికి నిన్న, BIE నుండి ప్రతినిధి బృందం ఎక్స్పో హౌస్ మరియు అల్ బిడ్డా పార్క్‌లను సందర్శించింది. ఇప్పటికే కొన్ని దేశాలు తమ పెవిలియన్ల కోసం సన్నాహాలు ప్రారంభించాయని తన సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రాండ్ ఓపెనింగ్ కోసం ప్రతిదీ సిద్ధంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఎక్స్‌పోలో మొత్తం 80 దేశాలు పాల్గొంటాయని వెల్లడించారు. అక్టోబర్ 2 నుండి ప్రారంభమై ఎక్స్ పో మార్చి 28, 2024 వరకు జరుగుతుంది. ఎక్స్పో 2023 దోహా 179 రోజుల పాటు కొనసాగుతుంది.ఇది 2022లో ప్రపంచ కప్ తర్వాత ఖతార్ హోస్ట్ చేసే రెండవ అతిపెద్ద ఈవెంట్‌గా పరిగణిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







