వాణిజ్య రంగంలో 1.65 మిలియన్లకు చేరిన ఉద్యోగులు
- July 08, 2023
రియాద్: 2023 మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి హోల్‌సేల్, రిటైల్ వాణిజ్యం, వాహనాల మరమ్మతులతో సహా వాణిజ్య రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1.653 మిలియన్లకు చేరుకుంది. గత 3 నెలల్లో మొత్తం 4,451 మంది సౌదీ పురుష, మహిళా ఉద్యోగులు ఈ రంగంలో చేరినట్లు అధికార నివేదిక తెలిపింది. సెక్టార్‌లోని సౌదీల సంఖ్య 424,734కి చేరుకుంది. మొత్తం ఉద్యోగులలో 25.7% ఉన్నారు. అయితే విదేశీ ఉద్యోగుల సంఖ్య 1,228,816కి చేరుకుంది. మొత్తంలో 74.3% ఉన్నారు. ఈ రంగంలోని మహిళల విషయానికొస్తే, వారి మొత్తం సంఖ్య సుమారు 213,000కి చేరుకుంది. మొత్తం మహిళా కార్మికులలో 17.4% ఉన్నారు. దాదాపు 199,000 మంది, సౌదీ మహిళలు ఈ రంగంలోని మొత్తం మహిళా శ్రామికశక్తిలో 93.5% ఉండగా, విదేశీ మహిళా కార్మికుల సంఖ్య 13,961 గా ఉన్నారు. రియాద్ ప్రాంతంలో అత్యధికంగా 40.3% లేదా 605,853 మంది కార్మికులు ఉన్నారు. 442,166 మంది కార్మికులతో మక్కా, 246,860 మంది కార్మికులతో తూర్పు ప్రాంతం (అల్-షార్కియా) రెండవ స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







