సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో రెండు కొత్త పర్యాటక స్టేషన్లు
- July 08, 2023
మస్కట్: సందర్శకులకు ఆహ్లాదకరమైన మరియు విలక్షణమైన పర్యాటక అనుభవాన్ని అందించడానికి... అల్ అష్ఖారా ఫోరమ్ రాస్ అల్-హద్ స్టేషన్ తో పాటు అల్ కమిల్, అల్-వాఫీ విలాయత్‌లలో ఏకీకృత పర్యాటక స్టేషన్ ప్రారంభించబడింది. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పర్యాటక ప్రదేశాలను సందర్శకులను పరిచయం చేయడం, వారికి ఉత్తేజకరమైన మరియు ఆనందించే అనుభవాన్ని అందించడం ఈ స్టేషన్ల లక్ష్యం. అజ్వా అల్ అష్ఖారా కార్యకలాపాలు జూలై 5న ప్రారంభమయ్యాయి. జూలై 24 వరకు ఇవి కొనసాగుతాయని అల్-కమిల్, అల్-వాఫీ డిప్యూటీ గవర్నర్, అల్-అష్ఖారా ఫోరమ్ ప్రధాన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు షేక్ ముహమ్మద్ బిన్ అలీ అల్ హినై స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు. అజ్వా అల్-అష్ఖారా ఫోరమ్ ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను ఆహ్వానిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







