శ్రీ విష్ణు విషయంలో అలా జరుగుతోందా.?
- July 08, 2023
శ్రీ విష్ణు మంచి నటుడు. విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలడు. కామెడీ రోల్ అయినా, సీరియస్ రోల్ అయినా, విలన్ అయినా, పక్కింటబ్బాయ్ అయినా.. ఇలా ఏ పాత్ర తీసుకున్నా శ్రీ విష్ణు పరకాయ ప్రవేశం చేసేస్తాడు.
అయితే, స్టార్ డమ్ దక్కడం లేదెందుకో శ్రి విష్ణుకి. లేటెస్ట్గా ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమాకి టాక్ బాగుంది. సూపర్ హిట్ అనదగ్గ సినిమానే కూడా. వసూళ్లు బాగా వస్తున్నాయ్. అయినా కానీ, ఈ సినిమా గురించి మాట్లాడుకునే వాళ్లే కరువాయె.
కంటెంట్ లేని సినిమాలు హిట్టూ సూపర్ హిట్టూ.. అంటూ సంచలనాలు సృష్టిస్తున్నాయ్ ఈ మధ్య. అలాంటప్పుడు ‘సామజవరగమన’ వంటి మంచి కంటెంట్ వున్న సినిమాల గురించి మాట్లాడుకోకపోవడం దురదృష్టకరం. ఇలాంటి కంటెంట్ వున్న సినిమాలకు ఆదరణ దక్కాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. కానీ, ఎందుకో తెలీదు శ్రీ విష్ణుని తొక్కేస్తున్నారు.. అంటూ ప్రచారం జరుగుతోంది.
ఎందుకలా జరుగుతోందో తెలీదు కానీ, ‘సామజవరగమన’ సినిమాని ఇంకాస్త గట్టిగా ప్రమోట్ చేస్తే వర్కవుట్ అయ్యి వుండేదేమో అని శ్రీ విష్ణు సన్నిహితులు కొందరు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







