‘ఆదికేశవ’ రిలీజ్ డేట్ ఫిక్స్.! మామా అల్లుళ్లు ఒకే నెలలో.!
- July 08, 2023
త్వరలో మెగా పండగ షురూ కానుంది. జూలై 28న ‘బ్రో’ సినిమా రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో మంచి అంచనాలతో వస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
కొద్ది రోజుల గ్యాప్‌లోనే అంటే ఆగస్ట్ 11న మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో రాబోతున్నారు. తమన్నా, కీర్తి సురేష్ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇదిలా వుంటే, మరి కొద్ది రోజుల గ్యాప్‌లోనే అంటే, ఆగస్ట్ 18న మెగా చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ్’ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్. కమర్షియల్ హంగులతో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందించినట్లు లేటెస్ట్ టీజర్ ద్వారా అర్ధమవుతోంది.
ఇలా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో మెగా కాంపౌండ్ హీరోలు త్వరలో సందడి చేయనున్నారు. ఇంకేముంది.! మెగా ఫ్యాన్స్‌కి ఇంతకన్నా కావల్సిన పండగేముంది.!
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







