పూరీ-రామ్ పోతినేని.! ‘డబుల్ ఇస్మార్ట్’ షురూ.!
- July 08, 2023
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇటు రామ్‌కీ అటు పూరీ జగన్నాధ్‌కీ మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది ‘ఇస్మార్ట్ శంకర్’. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలనుకున్నారు.
కానీ, కుదరలేదు. ఇక ఇప్పుడు అందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 9న ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రాజెక్ట్‌ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
జూలై 12నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లోనే ఈ సినిమా కూడా రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం హీరోయిన్స్‌గా ఎవరిని తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ప్రస్తుతం రామ్ పోతినేని, బోయపాటి శీనుతో ‘స్కంధ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రామ్, ‘డబుల్ ఇస్మార్ట్’పైనా ఫోకస్ పెట్టబోతున్నాడనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







