చైనా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంది
- May 14, 2016
చైనా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుందని, భారత సరిహద్దుల్లో మరిన్ని సైనిక బలగాలను మోహరించిందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ తెలిపింది. చైనా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల తన సైనిక స్థావరాల్లో ప్రత్యేకించి పాకిస్తాన్‌లో సైనిక బలగాలను పెంచుతోందని అమెరికా హెచ్చరించింది. భారత సరిహద్దులకు దగ్గరలో చైనా తన సైనిక బలగాలను పెంచినట్లు తాము గమనించామని అమెరికా రక్షణ శాఖ ఉప సహాయ మంత్రి (తూర్పు ఆసియా) అబ్రహాం ఎం డెన్మార్క్ వెల్లడించారు. చైనా సైనిక, భద్రతా బలగాలకు సంబంధించిన పరిణామాలపై అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ రూపొందించిన వార్షిక నివేదికను అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన అనంతరం డెన్మార్క్ ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అయితే చైనా ఏ ఉద్దేశంతో తన రక్షణ పాటవాన్ని, సైనిక బలగాల మోహరింపును పెంచుకుంటోందో అనే విషయంలో ఒక నిర్ధారణకు రావడం కష్టమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







