ప్రజలకు హిమాచల్ సీఎం హెచ్చరిక
- July 10, 2023
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షాలు కురుస్తున్నదున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. (Himachal Chief Minister’s Stay Indoors) 1100. 1070, 1077 ల నంబర్లతో మూడు హెల్ప్ లైన్ లను ప్రారంభించామని సీఎం చెప్పారు.
తాను సహాయం చేయడానికి 24 గంటలూ అందుబాటులో ఉంటానని, ప్రజలు ఈ విపత్తు సమయంలో హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ కాల్ చేయాలని సీఎం కోరారు. (Amid Heavy Rain Alert) శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో క్యాంపులు వేసి ప్రజలకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ‘‘దయచేసి ఈ విపత్తు సమయంలో ప్రజలకు సహాయం చేయండి, వారి నష్టాలకు పరిహారం అందేలా చూడండి’’ అని సీఏం సుఖు కోరారు.
ఈ వరద విపత్తు వల్ల ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారని, గల్లంతైన వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం వివరించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు విపత్తు రెస్పాన్స్ బలగాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం, వరదల యొక్క భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మనాలి, కులు, కిన్నైర్, చంబా ప్రాంతాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







