దుబాయ్ లో ‘బవాల్’ ట్రైలర్ లాంచ్
- July 10, 2023
దుబాయ్: బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ఇప్పటివరకు అన్ని ప్రయోగాత్మక సినిమాలే చేసింది. మొదటిసారి కాస్త కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. కానీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కానుండటం గమనార్హం. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నితేశ్ తివారి దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలా నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బవాల్’. ఈ సినిమా జులై 21 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
తాజాగా ‘బవాల్’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. దుబాయ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో ఈ ట్రైలర్ లాంచ్ ని చేశారు. ట్రైలర్ లో..హీరో ఓ హిస్టరీ టీచర్ అని చూపించారు. హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమ, పెళ్లి అనంతరం హనీమూన్ కోసం పారిస్ కు వెళ్తారు. అక్కడ హీరోకు రెండో ప్రపంచయుద్ధం సన్నివేశాలు గుర్తుకురావడం, వరుణ్ – జాన్వీ మధ్యలో గొడవలు అవ్వడం చూపించారు. దీంతో ట్రైలర్ చూస్తుంటే ఓ మాములు లవ్ స్టోరీకి రెండో ప్రపంచయుద్ధానికి ఏదో లింక్ పెట్టినట్టు తెలుస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
జాన్వీ ఇప్పటివరకు కమర్షియల్ గా ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఈ సినిమాతోనైనా కమర్షియల్ హిట్ కొడుతుంది అనుకుంటే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తుంది. ఇది వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది. ఇదే జాన్వికి మొదటి కమర్షియల్ హిట్ అవుతుందని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







