గ్యాస్ నొప్పి, త్రేన్పులు బాధిస్తుంటే ఇలా ట్రై చేసి చూడండి.!
- July 10, 2023ఆయిల్ ఫుడ్ కానీ, అనారోగ్యకరమైన ఫుడ్ కానీ అధికంగా తీసుకున్నప్పుడు అది పొట్టలో చాలా ఇబ్బంది పెడుతుంది. ఈజీగా డైజెస్ట్ కాకుండా, గ్యాస్ సంబంధిత నొప్పులు, విపరీతమైన త్రేన్పులు బాధిస్తుంటాయ్.
ఇలాంటి ఫీలింగ్ వున్నప్పుడు ‘ఈనో’ తదితర మార్కెట్లో లభించే మందుల్ని వేసుకుంటుంటారు. అప్పుడప్పుడూ వాడితే ఫర్వాలేదు కానీ, అవి అలవాటుగా మారితే చాలా ప్రమాదకరం.
అందుకే, ఇలాంటి జీర్ణ సమస్యలు తలెత్తినప్పుడు మన వంటిల్లు మనకి దివ్యౌషధాలెన్నో సమకూర్చి పెట్టింది. ముఖ్యంగా వంట గదిలోని పోపుల పెట్టె ఓ పెద్ద మెడిసన్ బాక్స్‌గా చెప్పొచ్చు.
జీలకర్ర పొడిని ఓ గ్లాసు వేడి నీళ్లలో కలిపి తాగితే గ్యాస్ నొప్పి పోతుంది. అలాగే వాము నీరు కూడా. లవంగాలు యాసిడ్ స్థాయుల్ని న్యూట్రలైజ్ చేయడానికి చక్కగా ఉపయోగపడతాయ్.
డైలీ ఉదయాన్నే లవంగాల పొడిని ఓ చిన్న గ్లాస్ వాటర్‌లో మిక్స్ చేసి తాగితే మంచి పలితం వుంటుంది. నిమ్మరసం కూడా ఈ సమస్యకు మంచి పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్