కవిత పటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
- July 10, 2023
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత తన పిటిషన్ లో కోరారు.
అయితే సర్వోన్నత న్యాయస్థానంలో కోర్టు నంబర్ 2, 8 కార్యకలాపాలు నేడు రద్దయ్యాయి. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేని కారణంగా సోమవారం కోర్టు నంబర్ 2 కార్యకలాపాలు రద్దయ్యాయి. దీంతో కవిత పిటిషన్ పై కూడా విచారణ వాయిదా పడింది. కోర్టు నంబర్ 2, 8 లో రద్దయిన కేసుల విచారణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..







