బహ్రెయిన్ లో రాజకీయ అభ్యర్థికి ఆరు నెలల జైలుశిక్ష

- July 10, 2023 , by Maagulf
బహ్రెయిన్ లో రాజకీయ అభ్యర్థికి ఆరు నెలల జైలుశిక్ష

బహ్రెయిన్: బహ్రెయిన్ రాజకీయ అభ్యర్థికి ఆరు నెలల జైలు శిక్షను కాసేషన్ కోర్ట్ సమర్థించింది. అతను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల అధికారంపై తప్పుడు ఆరోపణలు చేసి దాని ప్రతిష్టను దిగజార్చాడని నిర్ధారించింది. నార్తర్న్ గవర్నరేట్‌లోని ఎలక్టోరల్ అథారిటీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ ఆన్‌లైన్ వీడియోలను ప్రసారం చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యర్థి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తేల్చింది. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎన్నికల అధికారాన్ని కించపరిచినందుకు అభ్యర్థిపై అభియోగాలు మోపింది. మొదటగా ట్రయల్ కోర్టు సదరు వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, తీర్పుపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అప్పీల్ చేయడంతో శిక్షను మరో మూడు నెలలకు పెంచారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com