గ్యాస్ నొప్పి, త్రేన్పులు బాధిస్తుంటే ఇలా ట్రై చేసి చూడండి.!
- July 10, 2023
ఆయిల్ ఫుడ్ కానీ, అనారోగ్యకరమైన ఫుడ్ కానీ అధికంగా తీసుకున్నప్పుడు అది పొట్టలో చాలా ఇబ్బంది పెడుతుంది. ఈజీగా డైజెస్ట్ కాకుండా, గ్యాస్ సంబంధిత నొప్పులు, విపరీతమైన త్రేన్పులు బాధిస్తుంటాయ్.
ఇలాంటి ఫీలింగ్ వున్నప్పుడు ‘ఈనో’ తదితర మార్కెట్లో లభించే మందుల్ని వేసుకుంటుంటారు. అప్పుడప్పుడూ వాడితే ఫర్వాలేదు కానీ, అవి అలవాటుగా మారితే చాలా ప్రమాదకరం.
అందుకే, ఇలాంటి జీర్ణ సమస్యలు తలెత్తినప్పుడు మన వంటిల్లు మనకి దివ్యౌషధాలెన్నో సమకూర్చి పెట్టింది. ముఖ్యంగా వంట గదిలోని పోపుల పెట్టె ఓ పెద్ద మెడిసన్ బాక్స్‌గా చెప్పొచ్చు.
జీలకర్ర పొడిని ఓ గ్లాసు వేడి నీళ్లలో కలిపి తాగితే గ్యాస్ నొప్పి పోతుంది. అలాగే వాము నీరు కూడా. లవంగాలు యాసిడ్ స్థాయుల్ని న్యూట్రలైజ్ చేయడానికి చక్కగా ఉపయోగపడతాయ్.
డైలీ ఉదయాన్నే లవంగాల పొడిని ఓ చిన్న గ్లాస్ వాటర్‌లో మిక్స్ చేసి తాగితే మంచి పలితం వుంటుంది. నిమ్మరసం కూడా ఈ సమస్యకు మంచి పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







