యూఏఈ ఆకాశంలో ఉల్కాపాతం.ఎప్పుడు చూడవచ్చంటే?

- July 10, 2023 , by Maagulf
యూఏఈ ఆకాశంలో ఉల్కాపాతం.ఎప్పుడు చూడవచ్చంటే?

యూఏఈ: యూఏఈ ఆకాశంలో ఉల్కాపాతం కనువిందు చేయనుంది. పెర్సీడ్ ఉల్కాపాతంతో మరోసారి కాస్మోస్ వైభవాన్ని చూసే అవకాశాన్ని ఆనందించవచ్చు. ఆగస్ట్ 12న రాత్రి 8:55pm నుండి ప్రారంభమవుతుందని, ఆగస్టు 13 తెల్లవారుజామున వరకు కొనసాగుతుందని,  పెర్సీడ్ ఉల్కాపాతం గంటకు 100 ఉల్కల వరకు ఉంటుందని అమిటీ దుబాయ్ శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ మరియు అమీశాట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శరత్ రాజ్ తెలిపారు. ప్రతి సంవత్సరంజూలై 23 నుండి ఆగస్టు 22 వరకు పెర్సీడ్ ఉల్కాపాతం సంభవిస్తుందని పేర్కొన్నారు. "పెర్సీడ్‌లు కామెట్ 109P/స్విఫ్ట్-టటిల్ శిధిలాల వల్ల ఏర్పడతాయి. ఇది సుమారు 133 సంవత్సరాల కక్ష్య కాలాన్ని కలిగి ఉంది.మళ్లీ 2126లో తిరిగి వస్తుందని భావిస్తున్నారు. పెర్సీడ్ ఉల్కాపాతం గరిష్టంగా ప్రతి గంటకు 100-130 ఉల్కలను ఉత్పత్తి చేస్తుంది.’’ అని రాజ్ వివరించారు. పెర్సీడ్ ఉల్కలు ఎక్కువగా ఇసుక రేణువు నుండి బఠానీ-పరిమాణ వస్తువుల వరకు చిన్న కణాలతో రూపొందించబడతాయని,  అవి సెకనుకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో భూమి వాతావరణాన్ని తాకినప్పుడు, గాలితో ఘర్షణ వాటిని మండేలా చేస్తుందన్నారు. దీని ఫలితంగా రాత్రి ఆకాశంలో అద్భుతమైన కాంతి చారలు కనిపిస్తాయని చెప్పారు. ఇవి నీలం, ఆకుపచ్చ, పసుపు లేదా తెలుపు రంగులలో కనిపించి కనువిందు చేస్తాయన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com