బహ్రెయిన్ లో రాజకీయ అభ్యర్థికి ఆరు నెలల జైలుశిక్ష
- July 10, 2023బహ్రెయిన్: బహ్రెయిన్ రాజకీయ అభ్యర్థికి ఆరు నెలల జైలు శిక్షను కాసేషన్ కోర్ట్ సమర్థించింది. అతను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల అధికారంపై తప్పుడు ఆరోపణలు చేసి దాని ప్రతిష్టను దిగజార్చాడని నిర్ధారించింది. నార్తర్న్ గవర్నరేట్‌లోని ఎలక్టోరల్ అథారిటీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ ఆన్లైన్ వీడియోలను ప్రసారం చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యర్థి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తేల్చింది. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎన్నికల అధికారాన్ని కించపరిచినందుకు అభ్యర్థిపై అభియోగాలు మోపింది. మొదటగా ట్రయల్ కోర్టు సదరు వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, తీర్పుపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అప్పీల్ చేయడంతో శిక్షను మరో మూడు నెలలకు పెంచారు.
తాజా వార్తలు
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి