BAPS బృందంతో షేక్ నహ్యాన్ సమావేశం
- July 10, 2023
అబుధాబి: BAPS స్వామీజీలు, వాలంటీర్‌లతో కూడిన బ్రహ్మవిహారిదాస్ స్వామి బృందానికి అబుధాబిలోని తన ప్రైవేట్ రాయల్ మజ్లిస్‌లో మంత్రి షేక్ నహ్యాన్ ముబారక్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతం పలికారు. అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంపై చర్చించారు. మందిర్ నిర్మాణం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా షేక్ నహ్యాన్ చరిత్రను రూపొందించడంలో స్వామీజీలు, వాలంటీర్ల గణనీయమైన సహకారాన్ని ప్రశంసించారు. అబుధాబిలోని BAPS హిందూ మందిర్ శాశ్వతమైన విలువలు, అది ప్రాతినిధ్యం వహిస్తున్న సాంస్కృతిక వారసత్వం స్వరూపంగా నిలుస్తుందన్నారు. మందిర నిర్మాణం భారతదేశం, యూఏఈ మధ్య లోతైన స్నేహానికి నిదర్శనంగా పనిచేస్తుందని, అదే సమయంలో అంతర్జాతీయ సామరస్యాన్ని కూడా పెంపొందిస్తుందని కొనియాడారు. చారిత్రాత్మకమైన మందిర నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించినందుకు బ్రహ్మవిహారిదాస్ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు పూజ్య మహంత్ స్వామి మహారాజ్ సేవలను స్మరించుకున్నారు. మందిరాన్ని ఫిబ్రవరి 2024లో ప్రారంభించనున్నట్టు బ్రహ్మవిహారిదాస్ స్వామిజీ తెలియజేశారు.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







