ఆహార భద్రత ఉల్లంఘన. రెస్టారెంట్‌ను మూసివేసిన యూఏఈ అథారిటీ
- July 12, 2023
యూఏఈ: 'ప్రజారోగ్యానికి ప్రమాదం' కలిగించే అనేక ఉల్లంఘనల కారణంగా అబుధాబిలోని ఒక రెస్టారెంట్‌ను ఎమిరేట్‌లోని ఫుడ్ సేఫ్టీ అథారిటీ మూసివేయవలసిందిగా ఆదేశించింది. అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) ప్రకారం.. ఎవర్గ్రీన్ వెజిటేరియన్ రెస్టారెంట్ - బ్రాంచ్ 3లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో సింక్ చుట్టూ ఉన్న కీటకాలు, పాత్రల నిల్వ, తయారీ ప్రాంతాలు, అలాగే అసమర్థమైన శీతలీకరణతో సహా పలు ఆహార భద్రత ఉల్లంఘనలను గుర్తించారు. రిఫ్రిజిరేటర్లో సరైన ఉష్ణోగ్రతను నిర్వహించకుండానే ఆహారాన్ని నిల్వ చేయడాన్ని గుర్తించారు. ఈ ప్రమాదకర పరిస్థితులను సరిచేయాలని, ఆహార భద్రతను మెరుగుపరచాలని రెస్టారెంట్‌ను పదేపదే హెచ్చరించినప్పటికీ, దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. దీని ఫలితంగా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. రెస్టారెంట్ ను మూసివేయాలని ఆర్డర్‌ను జారీ చేసింది. ఇది రెస్టారెంట్ ఎమిరేట్ చట్టం ద్వారా నిర్దేశించబడిన అన్ని అవసరమైన ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను నెరవేర్చే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. మే 2023లో ఆహార భద్రతా చట్టాలను ఉల్లంఘించినందుకు అల్ ఐన్లో హోలోమీట్ రెస్టారెంట్ అనే రెస్టారెంట్ మూసివేసిన విషయం తెలిసిందే. అబుధాబి ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 800555కు కాల్ చేయడం ద్వారా ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని అథారిటీ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







